రాములోరిని దర్శించుకున్న BRS నేత రాకేష్ రెడ్డి
BDK: బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం బూర్గంపాడు మండలంలో పర్యటించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.