ఆటోను ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు

ఆటోను ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు

KMM: బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామంలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిలిచి ఉన్న ఆటోను ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌ను వైద్యం నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని చిన్నారులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.