మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన ఎంఈవో

AKP: గొలుగొండలో మోడల్ స్కూల్ ను ఎంఈవో సత్యనారాయణ గురువారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల డైరీలను పరిశీలించారు. విద్యాబోధనపై ఆరా తీశారు. విద్యార్థులను ఆకర్షించే విధంగా విద్యాబోధన జరగాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులు గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం భోజన పథకాన్ని తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు.