అయోధ్యలో వెలుగులోకి 200 ఏళ్ల చరిత్ర
అయోధ్యలో సుమారు 200 ఏళ్ల నాటి అరుదైన పత్రాలు లభ్యమయ్యాయి. దేవనాగరి లిపిలో రాసిన ఈ పురాతన గ్రంథం ఇప్పుడు చరిత్రకారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అమూల్యమైన చారిత్రిక సంపదను భద్రపరిచేందుకు త్వరలోనే అయోధ్యలోని అంతర్జాతీయ రామకథా మ్యూజియంకు అప్పగించనున్నారు. మన పూర్వీకుల జ్ఞానాన్ని, సంస్కృతిని కాపాడేందుకు.. రాబోయే తరాలకు ఈ అపురూప నిధిని అందించేందుకు ఇది కీలక అడుగు.