పాడేరు లో రేపు ఆదివాసి ర్యాలీ!
ASR: షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ యాత్ర కొనసాగుతోంది. దీని ముగింపు ర్యాలీ శుక్రవారం పాడేరులో జరగనుంది. ఆదివాసులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జేఏసీ పిలుపునిచ్చింది. నాన్-ట్రైబల్ నియామకాలు రద్దు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.