'ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం'
KDP: రాజుపాలెం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెళ్లాలాలోని శ్రీ సంజీవరాయ స్వామి ఆలయానికి ఓ భక్తుడు శనివారం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన నీలం నారాయణ దంపతులు ఆలయంలో ఉత్సవ కమిటీ సభ్యుడు లక్ష్మీనారాయణ రెడ్డికి లక్ష రూపాయల నగదును ఇచ్చారు. అనంతరం నారాయణ దంపతులకు శాలువా కప్పి సన్మానించారు.