డేటా ఎంట్రీలో ఉచిత శిక్షణ

డేటా ఎంట్రీలో ఉచిత శిక్షణ

క‌ృష్ణా: పామర్రు(M) కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో స్కిల్ హబ్ లో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో 3 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఉచిత శిక్షణ తరగతులు మొదల వుతాయని చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని కోరారు.