రైలు మార్గంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

రైలు మార్గంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

CTR: కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని మోడల్ కాలనీ డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రైలు కిందపడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. 25 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం CHకు తరలించి కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.