నిరుద్యోగిత రేటు 40 శాతం తగ్గింది: మమత

నిరుద్యోగిత రేటు 40 శాతం తగ్గింది: మమత

తన పాలనలో నిరుద్యోగిత రేటు 40 శాతం తగ్గిందని సీఎం మమతా వెల్లడించారు. ప్రభుత్వం 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించిందని పేర్కొన్నారు. వారిలో 10 లక్షల మంది ఇప్పటికే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇప్పటికే ప్రతి నెలా రూ.10 వేలు ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.