సీతమ్మధారలో పడకేసిన పరిశుద్ధ్యం

సీతమ్మధారలో పడకేసిన పరిశుద్ధ్యం

VSP: సీతమ్మధారలోని అపార్ట్మెంట్ల ముందు రోడ్డుపైనే చెత్తాచెదారం పేరుకుపోయింది. మరోపక్క డ్రైనేజీ కాలువ నిండిపోయి మురుగునీరు రోడ్డుపైకి పారుతోందని స్థానికులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్యం పడకేయడంతో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.