గుండెపోటుతో వృద్ధుడు మృతి
KNR: హుజూరాబాద్ పట్టణ బస్టాండ్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. బస్సు కోసం వేచి చూస్తున్న క్రమంలో ఓ వృద్ధుడు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మృతుడిని మంచిర్యాల జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ ఉద్యోగి కవ్వ రాజిరెడ్డిగా గుర్తించారు. ఆయన హుజూరాబాద్ నుంచి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.