జిల్లా నూతన విద్యాధికారిగా అశ్విని తానాజీ వాంఖాడే
KNR: జిల్లా నూతన విద్యాధికారిగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అశ్విని తానాజీ వాంఖాడేకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకే ఉన్న జిల్లా విద్యాధికారి చైతన్య జైనిని ఖమ్మం జిల్లాకు బదిలీ చేసిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు.