VIDEO: పాణ్యం వద్ద ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్
NDL: పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద గురువారం రాత్రి కర్నూలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టైరు హఠాత్తుగా ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాగా.. ఊడిన టైరు తగిలి తమ్మరాజుపల్లికి చెందిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కొన్ని మోటార్ సైకిల్స్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.