నల్గొండలో ధాన్యం లారీ బోల్తా

నల్గొండలో ధాన్యం లారీ బోల్తా

NLG: ఒక ధాన్యం లారీ బోల్తా పడిన ఘటన నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద గురువారం చోటుచేసుకుంది. చందనపల్లి ఐకేపీ నుంచి ధాన్యం బస్తాలు హాలియాకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ లారీ వేనుక ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పేను ప్రమాదం తప్పిందని, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రోడ్డు‌పై ధాన్యం బస్తాలు పడిపోయాయి.