పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ATP: కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ బీకే పార్థసారథి అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 80 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ. 3.30 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.