భగ్గుమంటున్న వరిగడ్డి ధర

భగ్గుమంటున్న వరిగడ్డి ధర

KRNL: జిల్లాలో వరిగడ్డి ధరలు ఆకాశాన్నంటాయి. గత ఏడాది ట్రాక్టర్‌ గడ్డి ధర రూ.11 వేలు ఉండేది. ఇప్పుడు రూ.15వేలు ఉండడంతో పాడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు  దెబ్బతినడంతో వరిగడ్డి కొరత ఏర్పడింది. వ్యాపారులు బనగానపల్లి, అవుకు, అనంతపురం నుంచి తెచ్చి ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.