కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సమ్మిగౌడ్
MHBD: కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, కాట్రపల్లి గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా సమ్మిగౌడ్ ఫౌండేషన్ ఛైర్మన్ చిలువేరు సమ్మిగౌడ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నదానం వడ్డించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.