ప్రతీసారి మేడారం జాతరకు ముందే బదిలీలు..!

ప్రతీసారి మేడారం జాతరకు ముందే బదిలీలు..!

MLG: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు సర్వసాధారణం అయినప్పటికీ ములుగు జిల్లా విషయంలో మాత్రం ప్రాధాన్యత అంశంగా మారుతోంది. మేడారం మహా జాతరకు ముందే ఉన్నతాధికారులు బదిలీ కావడం చర్చకు దారితీస్తోంది. 2024 జాతరకు నెల ముందు అప్పటి ఎస్పీ సంగ్రామ్ సింగ్ బదిలీ అయ్యారు. ఇప్పుడు జాతరకు రెండు నెలలు ఉందనగా శబరీశ్ బదిలీ అయ్యారు.