ఉచితాలు వద్దు.. అభివృద్ధి ముద్దు: కార్పొరేటర్

ఉచితాలు వద్దు.. అభివృద్ధి ముద్దు: కార్పొరేటర్

MBNR: మహబూబ్‌నగర్ 21వ డివిజన్‌లో మంగళవారం ఇందిరమ్మ చీరల పంపిణీ సందర్భంగా కార్పొరేటర్ గుండా సంతోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఉచిత పథకాలకు అలవాటు పడకూడదని పేర్కొంటూ మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. కేవలం ఉచిత కానుకల కంటే డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనే శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు.