పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జిగా తుల ఆంజనేయులు నియామకం

MNCL: బీజేపీ యువ మోర్చా పెద్దపెల్లి పార్లమెంట్ ఇంచార్జ్‌గా జిల్లా కేంద్రానికి చెందిన తుల ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ నియామక పత్రం జారీ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. తనను నియమించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, కృతజ్ఞతలు తెలిపారు.