జర్నలిస్టుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చాలి

జర్నలిస్టుల సమస్యలను మేనిఫెస్టోలో చేర్చాలి

పశ్చిమగొదావరి: జర్నలిస్టుల సమస్యలను రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చాలని ఏపీ యూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్ కోరారు. విప్లవ వీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా శనివారం తాడేపల్లి గూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద జర్నలిస్టుల కోరికల దినోత్సవం నిర్వహించారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.