బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పనిసరి: ఎమ్మెల్యే
MBNR: జిల్లా ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 15 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో మేలు చేస్తుందని, ప్రతి బాలికకు తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు. మహిళల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు.