నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

NZB: నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు అందజేయాలని వివరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనన్నారు.