పునరావాస కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
W.G: మొగల్తూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. పునరావాస కేంద్రంలో అన్ని ఏర్పాట్లు బాగున్నాయా, భోజనం ఎలా ఉంది, మా అధికారులు బాగానే స్పందిస్తున్నారా తదితర వివరాలను తెలుసుకున్నారు. పెద్దమైన వాని లంక వద్ద ఒక కిలోమీటర్ పరిధిలో నిర్మిస్తున్న సముద్ర కోత అడ్డుకట్ట నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు.