బీసీలను మోసం చేసింది, చేయబోయేది కాంగ్రెస్ పార్టీనే: ఎర్రబెల్లి
JN: బీసీలను మోసం చేసింది, చేయబోయేది కాంగ్రెస్ పార్టీనే అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేవరుప్పుల శుక్రవారం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. చీరల పంపిణీ కూడా ఒక నాటకమే అని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గుడి చేతిలో పడి నాశనమయ్యిందని విమర్శించారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయన్నారు. కష్టపడి అభ్యర్థులను గెలిపించాలన్నారు.