జిల్లాలో భూగర్భ జలాలు పడిపోతున్నాయ్..!
VKB: జిల్లాలో భూగర్భ జిలాలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఫిబ్రవరి నెలలో 12.87 మీటర్ల లోతులో నీరు ఉండేది. మార్చి నెలలో 13.72 మీటర్ల లోతుకు వెళ్లాయి. అంటే సుమారుగా 0.85 మీటర్ల లోతుకు వెళ్లింది. అత్యధికంగా మర్పల్లి మండలంలో పడిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో 22.5 మీటర్ల లోతులో ఉండగా, మార్చి నెలలో 27.17 మీటర్ల లోతుకు పడిపోయాయి.