సివిల్స్ విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు
TG: సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో విజయం సాధించిన రాష్ట్ర అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్టం నుంచి 20 మంది విజయం సాధించగా వారిని అభినందించారు. UPSCకి ప్రిపేరయ్యే అభ్యర్థుల్లో పేదవారు ఉంటారని ప్రభుత్వం వారికి రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మెయిన్స్ రాసే విద్యార్థులకు ప్రభుత్వం రూ.లక్ష అందిస్తోంది.