పండుగల వేళ మార్కెట్ యార్డుకు సెలవులు
TG: ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఈనెల 18 నుండి 22 వరకు సెలవులు ప్రకటించారు. ఐదు రోజుల పాటు ఎలాంటి కొనుగోళ్లు, అమ్మకాలు జరగవని మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ తెలిపారు. తిరిగి ఈనెల 23 నుండి కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. యుద్ధం కారణంగా పసుపు ధరలు తగ్గుతున్నాయన్న వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.