బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేట పాతబజార్‌లో శనివారం అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు కొనసాగాయి. భక్తులు డప్పు వాయిద్యాలతో బాణాసంచా కాలుస్తూ శివసత్తుల నృత్యాలతో బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.