ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష
TPT: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన ఓ స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. శిక్ష పడిన వ్యక్తి తమిళనాడు విల్లిపురం జిల్లాకు చెందిన ముట్టియన్ ఆండీగా గుర్తించారు. ఇతను 2019లో చామల రేంజ్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ దాడుల్లో పట్టుబడ్డాడు. ఈ తీర్పు శేషాచలం అడవిలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఒక గట్టి హెచ్చరికన్నారు.