పూరీ ఆలయం పేరిట 60 వేలకుపైగా ఎకరాలు
ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి రాష్ట్రంలో 60 వేల ఎకరాలకుపైగా భూములు ఉన్నాయని ఆ రాష్ట్ర మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. మరో 6 రాష్ట్రాల్లో 395 ఎకరాలు ఉన్నట్లు అసెంబ్లీలో తెలిపారు. 12వ శతాబ్దం నాటి ఈ ఆలయం.. 'శ్రీ జగన్నాథ ఆలయ చట్టం, 1956' ప్రకారం న్యాయశాఖ నిర్వహణలో ఉంది. ఒడిశాలోని 24 జిల్లాల్లో 60,426.94 ఎకరాల భూమి జగన్నాథుడి పేరిట ఉందన్నారు.