VIDEO: ఘనంగా మార్కండేయ దేవాలయం వార్షికోత్సవం

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. 8వ వార్షికోత్సవం పురస్కరించుకొని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, అన్న ప్రసాద్ వితరణ కార్యక్రమం చేపట్టారు.