ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రమోషన్స్ కల్పించాలి: కలెక్టర్

ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రమోషన్స్ కల్పించాలి: కలెక్టర్

నెల్లూరు జిల్లాలోని అన్ని శాఖల్లో అర్హత కలిగిన వారందరికీ రానున్న నెల రోజుల్లో ప్రమోషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం అధికారులను ఆదేశించారు. కొన్ని శాఖల్లో ఎప్పటినుంచో సర్వీస్‌లో ఉంటూ ప్రమోషన్ పొందని వారు ఇంకా ఉన్నారని చెప్పారు. క్రిమినల్ శాఖా పరమైన కేసులు లేని వారందరికీ ప్రమోషన్ ఇవ్వాలని ఆదేశించారు.