పట్టపగలు వెలుగుతున్న వీధి లైట్లు

పట్టపగలు వెలుగుతున్న వీధి లైట్లు

ప్రకాశం: గిద్దలూరు పంచాయతీ పరిధిలో పట్టపగలు వెలుగుతున్న వీధి లైట్లు. నగరంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పక్క వీధిలో గత కొన్ని రోజులుగా పగలే వీధి లైట్లు వెలుగుతున్నాయి. నగర పంచాయతీ కార్యాలయం విద్యుత్ శాఖ వారికి బకాయిలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా రాత్రి, పగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతుండటం వలన ప్రజాధనం వృథా అవుతుందని ప్రజలు వాపోతున్నారు.