ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చిన కంకిపాడు ఎస్సై

ఆకతాయిలకు కౌన్సిలింగ్ ఇచ్చిన కంకిపాడు ఎస్సై

కంకిపాడు: సెంటర్, బస్టాండ్, కాలేజీల వద్ద లైసెన్స్, నెంబర్ ప్లేట్స్ లేకుండా బైక్‌పై తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఆకతాయిలను, మైనర్లను కంకిపాడు ఎస్సై సందీప్ శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.