నిధి ఆశచూపి రూ.3.50 కోట్ల దోపిడీ

నిధి ఆశచూపి రూ.3.50 కోట్ల దోపిడీ

AP: నిధుల ఆశచూపి దంపతుల నుంచి రూ.3.50 కోట్లను కాజేశాడో దొంగ గురువు. కర్నూలు ఆదోని(M) బైచిగేరికి చెందిన వెంకటయ్య దంపతులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని దుర్గాసింగ్‌కి దేవుడు వస్తాడని విని, అతణ్ని ఆశ్రయించారు. అతను దీన్ని ఆసరాగా తీసుకుని పొలంలో నిధి ఉందని, తీయకపోతే ప్రాణహాని అంటూ క్షుద్రపూజలు చేశాడు. ఇలా సుమారు రూ.3.50 కోట్లు కాజేశాడు.