అన్నదాత సుఖీభవ పథకంపై సమీక్ష

మన్యం: రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2 నుండి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో ప్రారంభించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను భాగస్వామం చేయాలని తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు.