సంపన్నులకు సడలింపు..సామాన్యులపై భారం: అఖిలపక్షం

సంపన్నులకు సడలింపు..సామాన్యులపై భారం: అఖిలపక్షం

KDP: మున్సిపల్ అధికారుల వైఖరిపై అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. లక్షల బకాయిలు ఉన్న సంపన్నులను వదిలేసి సామాన్యులపై పన్ను భారం మోపుతున్నారని మండిపడ్డారు. జనం నుంచి వసూలు చేసిన జనరల్ ఫండ్ ను మౌలిక వసతుల కోసం కాకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల డిన్నర్లు, విలాసాల ఖర్చులపై విచారించాలని డిమాండ్ చేశారు.