VIDEO: ఆన్‌లైన్ బెట్టింగ్‌పై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి
ADB: దహెగాం మండలంలో జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఐనాం గ్రామ శివార్లలో అక్రమంగా కొనసాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై 'టోకెన్ పద్ధతిలో' జరుగుతున్న ఈ జూదాన్ని అడ్డుకున్నారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 65,270 నగదు, 5 మొబైల్ ఫోన్లు, స్టీల్ బాక్స్, టోకెన్లు స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ తెలిపారు.