'సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయం'

'సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయం'

సత్యసాయి: సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి సవిత పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా విద్యా విస్తరణకు సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, విద్యా హక్కు కోసం ఆమె చేసిన పోరాటం అందరికీ ఆదర్శమని తెలిపారు.