కాలువలో మృతదేహం.. కేసు నమోదు
GNTR: తెనాలి పట్టణంలోని పడవల కాలువలో గుర్తు తెలియని మృతదేహం కనిపించిన సంఘటన ఆదివారం కలకలం రేపింది. చెంచుపేటకు చెందిన లక్ష్మమ్మగా పోలీసులు గుర్తించారు. మృతురాలు ఈ నెల 5న 'విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకుని వస్తా' అంటూ ఇంటి నుంచి వెళ్లిన విషయం కుటుంబ సభ్యులు చెప్పారు. అనంతరం ఇలా జరిగింది. కాలువలో జారి పడ్డారా? లేక ఆమె కావాలని దూకారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.