గచ్చిబౌలి హాకీ మైదానానికి అంతర్జాతీయ గుర్తింపు

గచ్చిబౌలి హాకీ మైదానానికి అంతర్జాతీయ గుర్తింపు

HYD: గచ్చిబౌలి స్టేడియంలోని హాకీ మైదానానికి అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH) అధికారికంగా 'కేటగిరీ 2' ధ్రువీకరణ పత్రాన్ని అందించింది. తెలంగాణ ప్రభుత్వం క్రీడా మౌలిక సదుపాయాల పట్ల చూపుతున్న నిబద్ధతకు ఈ గుర్తింపు ఒక నిదర్శనం. ఈ సర్టిఫికేషన్‌తో ఇప్పుడు ఈ స్టేడియం అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు, టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవడం విశేషం.