విద్యాసంస్థల్లో 'జీరో వేస్ట్' విధానం అమలు చేయాలి: కలెక్టర్

విద్యాసంస్థల్లో 'జీరో వేస్ట్' విధానం అమలు చేయాలి: కలెక్టర్

W.G: పాఠశాలలు, వసతి గృహాల్లో వ్యర్థాల నియంత్రణకు శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ విద్యాశాఖ అధికారులతో 'జీరో వేస్ట్ ఇనిషియేటివ్'పై ఆమె సమీక్ష నిర్వహించారు. వ్యర్థాల పునర్వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, విద్యాసంస్థలను చెత్తరహిత నిలయాలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.