సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతులు

సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతులు

KNR: ఓబులాపూర్-మస్కుపల్లి మధ్య దెబ్బతిన్న రోడ్డును ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్ రమేశ్ తన సొంత ఖర్చుతో బాగు చేయించారు. రెండు కిలోమీటర్ల మేర గుంతలను జేసీబీ, ట్రాక్టర్ల సాయంతో కంకర పోసి చదును చేయించారు. అధికారులు పట్టించుకోని చోట చిరుద్యోగి స్పందించిన తీరుపై ప్రయాణికులు, వాహనదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.