కో-ఆప్షన్ పదవులకు 5 నామినేషన్లు దాఖలు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ పదవులకు ఇప్పటివరకు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. కొండ పద్మశేఖర్, జగన్మోహన్ రావు, మీనాజ్, తుబుస్సుమ్, బెంజమిన్ కో ఆప్షన్ కోసం దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. ఈనెల 9న జరగనున్న కార్పొరేషన్ పాలకవర్గ సమావేశంలో అధికారికంగా కో- ఆప్షన్ సభ్యులను ఎంపిక జరగనుందని అధికారులు వెల్లడించారు.