తహసీల్దార్ల మార్పుతో ఆగని అవస్థలు!
NZB: సాలూర మండలంలో నెలరోజుల్లో ముగ్గురు తహసీల్దార్లు మారడంతో పరిపాలనలో గందరగోళం ఏర్పడింది. తహసీల్దార్ డిజిటల్ సంతకం మారకపోవడంతో వివిధ ధ్రువపత్రాల జారీ ఆలస్యం అవుతోంది. భూ లావాదేవీలు నిలిచిపోయాయని, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు త్వరగా సమస్య పరిష్కరించాలని మండలవాసులు కోరుతున్నారు.