VIDEO: జాతీయ ఉపాధి హామీ పథకం మార్పును వ్యతిరేకించి రాస్తారోకో
WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని, మహాత్మా గాంధీ పేరును తొలగించడం అన్యాయమని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.