ఎమ్మెల్యే రేపటి పర్యటన షెడ్యూల్
NGKL: ఊర్కొండ మండలంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 10:30కి జగబోయినపల్లి గ్రామ సమీపంలో ఉన్న పత్తి మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.11:30కి రాచాలపల్లి నుంచి మాదారం చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేస్తారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు.