అకస్మాతుగా కూలిన బ్రిడ్జి.. ట్రాఫిక్ డైవర్ట్

అకస్మాతుగా కూలిన బ్రిడ్జి.. ట్రాఫిక్ డైవర్ట్

NLR: ASపేట మండల పరిధి సంగం-కలిగిరి మార్గంలో ఉండే ఓ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై సైదులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మార్గాన్ని మూసివేసి దానికి ప్రత్యామ్నాయంగా వేరే మార్గాన్ని వాహనదారులకు సూచించారు. సంగం మీదుగా వింజమూరు ఉదయగిరికి వెళ్లే మార్గం కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది నెలకొంది.