మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు: సీఐ
వాహనచోదకులు మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదవుతాయని ఒకటో పట్టణ సీఐ చిన్న పెద్దయ్య అన్నారు. కడప పాతబస్టాండులో శనివారం వాహనచోదకులకు అవగా హన కల్పించారు. సీటు బెల్టు, శిరస్త్రాణం ధరించాల న్నారు. చరవాణి మాట్లాడుతూ నడపరాదని పేర్కొ న్నారు. ప్రమాదంలో ఇంటి పెద్దదిక్కును కోల్పోతే ఆ కుటుంబం వీధిన పడుతుందన్నారు.